ఇప్పట్లో చంద్రమోహన్ రికార్డును ఎవ్వరూ బ్రేక్ చెయ్యలేరు!
on Nov 11, 2023
1966లో ‘రంగులరాట్నం’ చిత్రంతో ప్రారంభమైన చంద్రమోహన్ సినీ జీవితం 50 సంవత్సరాలపాటు అప్రతిహతంగా కొనసాగింది. పాత్రల ఎంపిక విషయంలో ఒక స్థిర అభిప్రాయం ఏర్పరుచుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే ఎక్కువ సంతృప్తిని పొందేవారు. అందుకే తను హీరోగా బిజీగా ఉన్న టైమ్‌లో కూడా రెండో హీరోగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా... ఏ క్యారెక్టర్ అయినా చేసేవారు. ఈ విషయంలో చంద్రమోహన్ దర్శకనిర్మాతల పాలిట వరంగా మారారు.
ఇదిలా ఉంటే.. ఓ అరుదైన రికార్డు చంద్రమోహన్ పేరు మీద ఉంది. దాన్ని బ్రేక్ చెయ్యడం ఇప్పట్లో ఎవ్వరి వల్లా కాదు. అదేమిటంటే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి అలనాటి స్టార్ హీరోల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి తర్వాతి తరం హీరోల వరకు అందరితోనూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఈతరం హీరోలైన మహేష్‌బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, రవితేజ, గోపీచంద్, మంచు విష్ణు, మంచు మనోజ్ చేసిన సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. మూడు తరాల హీరోలతో కలిసి నటించిన ఘనత చంద్రమోహన్‌ది. ఇది ఒక రికార్డుగా చెప్పొచ్చు. ఇప్పట్లో ఈ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఎవ్వరికీ లేదు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
